ట్రెండింగ్
Epaper    English    தமிழ்

45 ఏళ్ల వ్యక్తితో బాలికకు పెళ్లి.. ఏడాదికే అందరికీ షాక్

national |  Suryaa Desk  | Published : Wed, Mar 23, 2022, 01:39 PM

ఆ అమ్మాయి నిండా 18 ఏళ్లు రాలేదు. తల్లిదండ్రులు తొందరపడి 16 ఏళ్ల వయసులోనే బలవంతంగా పెళ్లి చేసేశారు. తండ్రితో సమాన వయసున్న 45 ఏళ్ల వ్యక్తితో ఆమె కాపురం చేయలేకపోయింది. అయిష్టంగానే ఓ అమ్మాయికి జన్మనిచ్చింది. చివరికి ఏడాది వ్యవధిలోనే అందరికీ ఆ బాలిక షాక్ ఇచ్చింది. ఈ ఆసక్తికర ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.


రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌కు చెందిన ఓ 45 ఏళ్ల వ్యక్తికి మధ్యప్రదేశ్‌కు చెందిన 16 ఏళ్ల బాలికకు ఏడాది క్రితం పెళ్లి అయింది. బాలికకు పెళ్లి వయసు రాకపోయినా, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా తల్లిదండ్రులు బలవంతంగా వేడుక జరిపించారు. ఇక అత్తింట్లో ఆ బాలిక ఎన్నో కష్టాలు పడింది. వారి వేధింపులు తట్టుకోలేక, అయిష్టంగా భర్తతో కాపురం చేయలేక మనోవేదన అనుభవించింది. ఏడాదికే అమ్మాయికి జన్మనిచ్చింది. ఇంతలో ఇటీవల ఆ అమ్మాయి ఓ యువకుడితో లేచిపోయింది. హర్యానాకు వెళ్లి, అక్కడ ఉద్యోగంలో చేరింది. అవసరమైతేనే ఫోన్‌లో సిమ్ వేసి, ఆ తర్వాత సిమ్‌ను విరగ్గొట్టేది.


మరో వైపు తన భార్య కనపడడం లేదని ఆమె భర్త రాజస్థాన్‌లో 2021 అక్టోబర్‌లో కిడ్నాప్ కేస్ పెట్టాడు. ఎంతో శ్రమించిన పోలీసులకు ఆమె ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. పోలీసులు ఆమెను తీసుకొచ్చి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ గిరీష్ గుర్జార్ ముందు హాజరుపర్చారు. తనకు 16 ఏళ్లకే బలవంతంగా పెళ్లి చేశారని, భర్తతో ఉండడం తనకు ఇష్టం లేదని ఆమె వెల్లడించింది. ప్రియుడుతోనే ఉంటానని తెగేసి చెప్పింది. ఆ తర్వాత ఆమెను సఖి వన్‌ స్టాప్ సెంటర్‌కు తరలించారు. ఇక ఈ కేసులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ విచారించి, బాలిక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa