శ్రీవారిని దర్శించుకోవడానికి వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనాలను పునరుద్దరించాలని ఇటీవల టీటీడీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు స్పెషల్ దర్శన టికెట్లను జారీ చేయడానికి రంగం సిద్ధం చేసింది. కానీ గురువారం సాఫ్ట్‌వేర్‌లో సమస్య ఏర్పడడంతో ఈ టోకెన్ల జారీని ఏప్రిల్ 8వ తేదీకి వాయిదా వేసినట్లు టిటిడీ అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ 8న ఉదయం 11 గంటలకు టోకెన్లను ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa