ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరుగుల ప్రవాహం సృష్టించిన...రాబిన్ ఊతప్ప

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 31, 2022, 10:53 PM

ముంబయి బ్రాబౌర్న్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్ మెన్ పరుగుల ప్రవాహం సృష్టించారు. లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో టాస్ ఓడిన చెన్నై తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 210 పరుగులు చేసింది. ఓపెనర్ రాబిన్ ఊతప్ప ఆరంభం నుంచి బ్యాట్ ఝుళిపించాడు. ఊతప్ప 27 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ తో 50 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 1 పరుగుకే అవుట్ అయినా, వన్ డౌన్ లో వచ్చిన మొయిన్ అలీ కూడా ధాటిగా ఆడడంతో స్కోరుబోర్డు పరుగులు తీసింది. మొయిన్ అలీ 22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేశాడు.  ఇక మిడిలార్డర్ లో వచ్చిన యువ కెరటం శివమ్ దూబే 30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 49 పరుగులు చేశాడు. రాయుడు 27, కెప్టెన్ జడేజా 17, ధోనీ 16 పరుగులు నమోదు చేశారు. లక్నో బౌలర్లలో అవేష్ ఖాన్ 2, ఆండ్రూ టై 2, రవి బిష్ణోయ్ 2 వికెట్లు తీశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa