జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు బీమా సౌకర్యం అందిస్తున్న సంగతి తెలిసిందే. రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా, ప్రమాదం జరిగినప్పుడు వైద్య ఖర్చులకు రూ.50 వేల వరకు బీమా సదుపాయం అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో, 2022-23 సంవత్సర కాలానికి గాను జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తల బీమా ప్రీమియంను పవన్ కల్యాణ్ చెల్లించారు. ఇవాళ తనను కలిసిన బీమా సంస్థ ఉన్నతాధికారులకు ఈ మేరకు చెక్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్సూరెన్స్ సంస్థ డీజీఎం, జనసేన పార్టీ బీమా పాలసీ సలహాదారు యడ్ల వెంకటనరసింహారావు, పార్టీ ట్రెజరర్ ఏవీ రత్నం పాల్గొన్నారు. కాగా, ఈ బీమా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa