గుంటూరు తాము అడిగిన డబ్బు ఇవ్వకుంటే మార్ఫింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో పెడతామని ఓబి క్యాష్ పర్సనల్ లోన్ నిర్వాహకులు బెదిరిస్తున్నట్లు శ్రీనగర్ 5/7కు చెందిన ఆయేషా సిద్ధికా అనే మహిళ అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 6న ఓబి క్యాష్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని లోను వద్దని దరఖాస్తును రద్దు చేసుకొని యాప్ ను కూడా డిలీట్ చేశారు. అయినా ఆ తర్వాత రోజు ఖాతాలో రూ. 3, 500 జమా చేశారని, ఈ మెయిల్ కు లోను వద్దని ఆ మొత్తం వెనక్కి తీసుకోవాలని మెసేజ్ పెట్టినా వారి స్పందన రాలేదని ఆమె తెలిపారు. యాప్ నిర్వాహకులు ఫోన్ చేసి రూ. 7, 000 వేలు చెల్లించాలని ఫోటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరించడంతో రూ. 14 వేలు పంపినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అయినా మరోరూ. 14 వేలు పంపాలని లేకుంటే బెదిరిస్తున్నట్లు ఆమె పోలీసులకు తెలిపారు.