ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీకాయం ఎంతో ప్రమాదం . అందులో అసలు చిన్న పిల్లలైతే ....? ఇవి పాటించండి .

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 02, 2022, 01:25 PM

చిన్న పిల్లలు ఎంత బొద్దుగా ఉంటె అంత ముద్దుగా ఉంటారు . అందుకని పిల్లలకి తల్లితండ్రులు ఆహరం విషయంలో ఎక్కువ శ్రద్ధ  చూపిస్తారు . మనకు తెలియని విషయం ఏమిటంటే , బొద్దుగా ఉండటం వేరు , భారీ ఖాయం వేరు . అదేంటి, లావుగా ఉన్నవాలనే కధ భారీ ఖాయం అంటారు అనుకుంటే మనం పొరపాటు పడినట్లే.  పిల్లలు ఎంత ఆహరం తీసుకున్న వాళ్ళు చూడటానికి బాగా యాక్టీవ్ గా , ఆరోగ్యంగా , ఆహ్లాదకరంగా ఉంటె వారు కేవలం బొద్దుగా తయారయ్యారు అని అర్థం .  ఆలా కాకుండా నీరసంగా , ఎక్కువగా నిల్చిలేకపోవడం , మాట్లాడేటప్పుడు ఆయాసం రావడం , శరీరం లోని భాగాలకు ముఖ్యంగా పొట్ట చుట్టుపక్కల కొవ్వు పట్టి చూడటానికి అంద వికారంగా ఉండటం , కాలు చేతుల చర్మం ఛారలుగా ఏర్పడి  మొద్దుబారిపోవడం లాంటివి భారీ ఖాయం గ పరిగణించవచ్చు.  ఇపుడు భారీకాయులుగా వున్న బాల బాలికలు యవ్వనంలోకి అడుగుపెడుతూనే డయాబెటిస్‌కి గురయ్యే ప్రమాదం వుంది. ఇదే పరిస్థితి కొనసాగితే మన దేశం అనారోగ్య దేశమవుతుంది. యువత అనారోగ్యంతో కూడినదై, దేశాన్ని వెనక్కి తీసుకెళ్తుంది  కాబట్టి బాల్యంలోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం  ఎంతైనా వుంది.
తీసుకునే ఆహారంలో  తక్కువ పోషక పదార్థాలు,  ఎక్కువ క్యాలరీలు వున్నప్పుడు, శారీరకంగా  శ్రమ లేనప్పుడు శరీరంలోకి అదనంగా చేరిన క్యాలరీలు కొవ్వులుగా
 మారి పొట్ట దగ్గర  పేరుకుంటాయి. క్రమంగా శరీరమంతా వ్యాప్తి చెంది భారీకాయంగా మారుతుంది. ప్రస్తుతం చిన్నారుల్లో కనిపిస్తున్న ఇబ్బంది ఇదే.
భారీకాయపు పిల్లల్లో తక్షణం కనిపించే ఇబ్బందులు కొన్నయితే, దీర్ఘకాలంలో తలెత్తే ఇబ్బందులు మరికొన్ని. చిన్నతనంలోనే భారీకాయం వచ్చిందంటే, కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బాల్యదశలోనే అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొనే దుస్థితి వస్తుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం వుంది. ఈ దశలో రక్తంలో చక్కెరల స్థాయి అధికంగా వుండి డయాబెటిక్‌కి గురయ్యే అవకాశం ఏర్పడుతుంది. ఇంకా కీళ్ళ ఇబ్బందులు, సరిగా నిద్రలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. బాల్యంలో భారీకాయంలో వున్నవారు పెద్దయిన తర్వాత సన్నబడే అవకాశం బాగా తక్కువ. యవ్వనంలోకి ప్రవేశించిన తర్వాత కూడా భారీకాయం నిలిచివుంటే గుండె జబ్బు, డయాబెటిస్, పక్షవాతం, ఎముకల బలహీనత లాంటివి వస్తాయి.
భారీకాయంవలన  స్ర్తిలలో సంతానలేమి సంభవిస్తుంది. రొమ్ము కాన్సర్, గర్భాశయ సమస్యలు తలెత్తుతాయి. థైరాయిడ్ గ్రంథిలో మార్పులు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణనాళ క్యాన్సర్, అండాశయ సమస్యలు వస్తాయి. డిప్రెషన్‌కు గురై అధికంగా తిండి తింటారు. ఇలా ఒకదానిపై ప్రభావం మరొకదానిపై ఉంటుంది. భారీకాయం వంశపారంపర్య లక్షణాలు కూడా. కుటుంబ చరిత్ర, ఆహారపు అలవాట్లు వంటివి పరీక్షించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పగలుగుతారు.
ఏది ఏమైనా  ఆహారపు అలవాట్లు మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వుంటుంది. ఆరోగ్యానిచ్చే పోషక పదార్థాలకు ప్రాధాన్యత పెంచి, క్యాలరీలు అధికంగా ఇచ్చేవాటిని తగ్గించుకోవాలి. అతిగా తినటంవల్ల శరీరం దెబ్బతింటుంది. జీర్ణక్రియ సామర్థ్యం తగ్గుతుంది. తిన్నది సరిగా ఒంటపట్టదు. ఫలితంగా క్యాలరీలు పేరుకుంటాయి. క్రమంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుంటుంది. అది మొదలైతే తగ్గడం చాలా కష్టం.
పిల్లలో ఎదుగుదల విషయంలో ఏదైనా తప్పు జరిగింది అంటే అది కేవలం వారి తల్లితండ్రులు లేదా సంరక్షకులదిగా భావించాలి. తెలియని పిల్లలకు చెప్పి చూపించాల్సిన భాద్యత వీరికి ఉంది కాబట్టి . అనగా మీ పిల్లల ఆరోగ్యం మీ చేతుల్లోనే అనేది గమనించి దానికి తగిన శ్రాధ తీసుకోవలయునదిగా వైద్య నిపుణుల సలహా .  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa