ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తన రెండో మ్యాచ్ కు సిద్ధమైంది. నేడు ముంబయి డీవై పాటిల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడనుంది. ఈ పోరులో టాస్ గెలిచిన సన్ రైజర్స్ సారథి కేన్ విలియమ్సన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని విలియమ్సన్ వెల్లడించాడు. అటు, లక్నో జట్టులో ఒక మార్పు జరిగింది. దుష్మంత చమీర స్థానంలో జాసన్ హోల్డర్ జట్టులోకి వచ్చాడని కెప్టెన్ కేఎల్ రాహుల్ వెల్లడించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa