ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రమంత్రులుతో జగన్ సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 05, 2022, 09:07 PM

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న జగన్ వెంటనే ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై గంటకుపైగా మోదీతో చర్చించారు. సమావేశం ముగిసిన వెంటనే ఆయన కేంద్ర మంత్రులతో సమావేశాలకు బయలుదేరారు.మోదీతో భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇంటికి చేరుకున్న జగన్‌ ఆమెను కలిశారు. 


రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆమెకు వివరించిన సీఎం జగన్ , రుణ పరిమితిని సవరించాలని విజ్ఞప్తి చేశారు. నిర్మలను కలిసిన అనంతరం జగన్ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఇంటికి వెళ్లారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని షెకావతిని కోరారు షెకావతితో భేటీ అనంతరం జగన్ నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa