ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ స్టేట్‌మెంట్ రాగానే వైసీపీ నేతలు ఉలిక్కి పడ్డారు: పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 05, 2022, 09:00 PM

వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన శ్రేణులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని తాను చాలా ఆలోచించి మాట్లాడానన్నారు. ఆ స్టేట్‌మెంట్ రాగానే వైసీపీ నేతలు ఉలిక్కి పడ్డారన్నారు. వైసీపీకి జనసేన అంటే ఎందుకు అంత భయమని ప్రశ్నించారు.

జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పలు కీలక అంశాలపై పవన్‌ ప్రసంగించారు. వైసీపీ రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రానివ్వబోమని స్పష్టం చేశారు. అలాంటి ప్రభుత్వం కోసం అధికారులు తాపత్రయపడవద్దని హితవు పలికారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకొచ్చి రాష్ట్రాన్ని 25 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని వైసీపీని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు తనను తీవ్రంగా కలచి వేశాయని చెప్పారు. వారి కుటుంబాలకు జనసేన తరుపున రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa