హిందూ వారసత్వ చట్టానికి సంబంధించిన చట్టం రాజ్యాంగానికి, లింగ సమానత్వానికి వ్యతిరేకంగా ఉందంటూ దాఖలైన పిటిషన్ ను ఈరోజు సుప్రీంకోర్టు విచారించింది. దీనికి సంబంధించి అభిప్రాయాన్ని వెల్లడించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నాలుగు వారాల్లోగా అభిప్రాయాన్ని తెలపాలని సమయాన్ని నిర్దేశించింది. ఈ పిటిషన్ ను కమల్ అనంత్ ఖోప్కార్ అనే వ్యక్తి దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ త్రివేదీలతో కూడిన ధర్మాసనం విచారించింది. సమాజం లైంగిక సమానత్వం వైపుగా అడుగులు వేస్తున్న ఈ తరుణంలో కూడా అసమానతలు ఉన్నాయని... హిందూ మహిళల తరపున ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టును పిటిషనర్ కోరారు. పురుషులతో పాటు మహిళలకు కూడా వంశపారంపర్యంగా సమాన హక్కులు ఉండాలని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa