ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ ఓటమి ఖాయ: జనసేన అధినేత పవన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 05, 2022, 09:35 PM

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ ఓట‌మి ఖాయ‌మ‌ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్  స్పష్టంచేశారు. అస‌లు వైసీపీకి ఓటు అడిగే హ‌క్కే లేద‌ని కూడా ఆయ‌న తేల్చేశారు. ఈ మేర‌కు మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన కార్యాల‌యంలో జ‌రిగిన పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో ప్ర‌సంగించిన ప‌వ‌న్‌...2024 ఎన్నిక‌ల‌కు సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ ఏమ‌న్నారంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ ఓట‌మి ఖాయం. 2024 ఎన్నికల్లో వైసీపీ ప్ర‌భుత్వం రాదు. ఆ ఎన్నికల్లో వైసీపీకి ఓటు అడిగే హ‌క్కు లేదు. ఇది కొత్త త‌రం రాజ‌కీయం. పాత త‌రం కాదు. వైసీపీ ఓట్లు చీల్చే ప్ర‌స‌క్తే లేద‌ని చాలా ఆలోచించి చెప్పా. శ్రీలంక‌లా ఏపీ అవ్వొద్ద‌నే ఆ మాట అన్నా.నా వ్యాఖ్య‌ల‌పై భిన్నాభిప్రాయాలు వ‌చ్చాయి. వ్యూహం నాకు వ‌దిలేయండి చాలు. నేను ఎవ‌రి ప‌ల్ల‌కీ మోయ‌డానికి రాలేదు. ప్ర‌జ‌ల‌ను ప‌ల్ల‌కీ ఎక్కించేందుకే వ‌చ్చా. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తున్నాం అంటూ ప‌వ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa