క్రికెట్ బెట్టింగ్ ఆగడాలకు యువకులు తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తోంది. ఇంత జరుగుతున్నా క్రికెట్ బుకీల ఆగడాలు ఏమాత్రం తగ్గినట్టు కనిపించడం లేదు. గతంలో మాదిరే తమ వలకు చిక్కిన యువకులను వేధించుకు తింటున్నారు. ఈ తరహా వేధింపులు తాళలేక ఓ యువకుడు ఏకంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది . జిల్లాలోని తాడేపల్లిగూడెం మండలం కడియద్దకు చెందిన దుర్గా ప్రసాద్ అనే యువకుడు క్రికెట్ బుకీల వలకు చిక్కాడు. ఈ క్రమంలో అతడు బుకీలకు రూ.1.80 లక్షలు బాకీ పడ్డాడట. ఈ డబ్బు కోసం బుకీలు నిత్యం దుర్గాప్రసాద్‌కు ఫోన్లు చేసి వేధిస్తున్నారట. దీంతో వారి వేధింపులు తాళలేక దుర్గాప్రసాద్ మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే సకాలంలో గుర్తించిన తల్లిదండ్రులు అతడిని తాడేపల్లిగూడెం ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa