ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నరసరావుపేట కి జగన్ రాక, పూర్తి షెడ్యూల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 06, 2022, 01:23 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం అనగా రేపు ( 7 మార్చి ) నూతనంగా ఏర్పాటైన  పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.35 గంటలకు నరసరావుపేటలోని ఎస్‌ఎస్‌ఎన్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. 10.50 గంటలకు పీఎన్‌సీ కాలేజీ వద్ద కాసు వెంగళరెడ్డి విగ్రహావిష్కరణ చేయనున్నారు. అనంతరం 11.00 గంటలకు స్టేడియం వద్దకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. అదే వేదికపై అనుకున్నట్లుగా వలంటీర్లను సత్కరించి ప్రోత్సాహకాలు అందించనున్నారు సీఎం జగన్‌. తిరిగి 12.35 గంటలకు నరసరావుపేట నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa