ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నగరపాలక సంస్థ అభివృద్ధికి ప్రజలు సహకరించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 06, 2022, 02:58 PM

విజయవాడ నగర పరిస్థితులపై అవగాహన ఉందని, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి ప్రజల సహకారంతో నగరాభివృద్దికి కృషి చేస్తానని, నూతన కమీషనర్ గా భాద్యతలు చేపట్టిన శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ. ఏ. ఎస్ అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమీషనర్ ఛాంబర్ నoదు నూతన కమీషనర్ గా శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ. ఏ. ఎస్ నేడు భాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంలో విజయవాడ నగరపాలక సంస్థ కమీషనర్ గా నియమించుట పట్ల గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై. ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసారు. విజయవాడతో నాకు ఎంతో అవినాభావ సంబంధం ఉందని, గతంలో గుంటూరు జాయింట్ కలెక్టర్, నూజివీడు సబ్ కలెక్టర్ గా కూడా తాను విధులు నిర్వర్తించానని, కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ గా విధులు నిర్వహించి ఇక్కడకు బదిలీ అయినట్లు తెలిపారు నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలు ఎదుర్కోను సమస్యల పరిష్కారానికై ప్రణాళిక ప్రకారం అందరి సహకారంతో, సమన్వయముతో పని చేస్తూ, నగరాన్ని అభివృద్ధి పధంలో నిలుపుటకు కృషి చేస్తానని అన్నారు. తొలుత నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (జనరల్) డా. జె. అరుణ, అన్ని విభాగముల అధిపతులతో కలసి నూతన కమిషనర్ గారికి స్వాగతం పలికి ఒకరినొకరు పరిచయం చేసుకోనారు. నగరపాలక సంస్థ నందు కమిషనరుగా భాద్యతలు స్వీకరించిన తదుపరి గౌరవ మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి గారిని మర్యాద పూర్వకంగా కలిసి నగరాభివృద్ధిపై చర్చించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa