భారత్‌మాల పరియోజన తొలి దశ కింద ఆంధ్రప్రదేశ్‌లో అయిదు గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ ప్రాజెక్ట్ లు చేపట్టినట్లు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ అయిదు ప్రాజెక్ట్‌లు 2026-27 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అయిదు గ్రీన్‌ఫీల్డ్ కారిడార్‌ల వివరాలను ఆయన తన జవాబులో పొందుపరచారు.
అందులో విశాఖపట్నం-రాయపూర్ మధ్య 99.63 కిలోమీటర్లు దూరం నిర్మించే ఆరు వరసల జాతీయ రహదారికి 3183 కోట్ల రూపాయలు మంజూరు చేయగా ఇప్పటికి 202 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఖమ్మం-దేవరాపల్లి మధ్య 56 కి.మీ దూరం నిర్మించే నాలుగు వరుసల రహదారి (ఎన్‌హెచ్ 365బీజీ) కోసం 1281 కోట్ల రూపాయలు కేటాయించగా ఇప్పటికి 200 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. చిత్తూరు-థాట్చూర్ మధ్య 96 కి.మీ దూరం నిర్మించే ఆరు వరసల రహదారి (ఎన్‌హెచ్-716బీ) కోసం 3179 కోట్లు కేటాయించగా ఇప్పటి వరకు 123 కోట్ల రూపాయలు ఖర్చైంది. బెంగుళూరు-చెన్నై మధ్య 85 కి.మీ దూరం నిర్మించే ఎక్స్‌ప్రెస్‌వేకు 4137 కోట్లు కేటాయింపు జరగ్గా ఇప్పటికి 123 కోట్ల రూపాయలు ఖర్చైంది. బెంగుళూరు-విజయవాడ మధ్య 343 కి.మీ దూరం నిర్మించే కారిడార్‌కు సంబంధించి ప్రాజెక్ట్ తీరుతెన్నులు, వ్యయంకు సంబంధించి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపొందించే పని ప్రారంభమైనట్లు మంత్రి గడ్కరీ వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa