అవినీతి రహిత రాజకీయాల కోసమే బీజేపీ వచ్చిందని ఆ పార్టీ ఏపీ చీఫ్ సోమువీర్రాజు అన్నారు. తమ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విశాఖలో బీజేపీ కార్యాలయంలో పార్టీ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో అవినీతిని తొలగించడానికి బీజేపీ ఆవిర్భవించిందని చెప్పారు. జాతీయ భావాలతో తాము పనిచేస్తామని తెలిపారు.
కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీ ఏర్పడిందని అన్నారు. అన్ని పార్టీలకూ ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని చెప్పుకొచ్చారు. ఈ నెల 20 వరకు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. విశాఖకు రైల్వే జోన్ వస్తుందని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై బీజేపీ తప్పకుండా మంచి నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa