ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డబ్బు కోసం వలపు బాణం విసిరిన త‌ల్లీకూతుళ్ళు.. చివరికి..

national |  Suryaa Desk  | Published : Wed, Apr 06, 2022, 05:42 PM

ఓ తల్లీకూతుళ్లు సులువుగా డబ్బు సంపాదించేందుకు పన్నాగం పన్నారు. ఓ వృద్ధుడిని టార్గెట్ చేసుకుని అతడిపై వలపు బాణం విసిరారు. సరిగ్గా గదిలో సన్నిహితంగా ఉండగా వీడియో తీసి, వేరే వారితో పోలీసులు అని చెప్పించి బెదిరించారు. లక్షల డబ్బు గుంజినా ఇంకా కావాలని డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారి బండారం బట్టబయలైంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

యూపీ రాజధాని లక్నో నగర సమీపంలోని రాజాజిపురానికి చెందిన ఓ వృద్ధుడికి అర్చనా వాలియా అనే మహిళ పరిచయం అయింది. ఇద్దరూ తమ ఫోన్ నంబర్లను పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నారు. కొన్ని రోజులు తర్వాత తన ఇంటికి ఆ వృద్ధుడిని అర్చనా ఆహ్వానించింది. ఆ సమయంలో ఆమె కుమార్తె మున్‌మున్ అక్కడే ఉంది. వృద్ధుడితో పాటు ఇంటిలోకి వెళ్లిన అర్చన తలుపు వేసుకుంది. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో హఠాత్తుగా ఇద్దరు వ్యక్తులు తలుపు తోసుకుని అక్కడకు వచ్చారు. ఇద్దరూ నగ్నంగా ఉండగా వీడియో తీశారు. తాము పోలీసులమని, అరెస్టు చేస్తామని చెప్పి బెదిరించారు.

బాధితుడు వేడుకోగా వీడియో బయటపెట్టకుండా ఉండేందుకు రూ.5 లక్షలు కావాలని అడిగారు. అక్కడికక్కడే రూ.15 వేలను బాధితుడు ఇచ్చాడు. తర్వాత మరో రూ.3.50 లక్షలను వారికి ముట్టజెప్పాడు. అయినా ఇంకా కావాలని అడగడంతో విసిగిపోయి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారి విచారణలో అర్చన కావాలనే వారితో కలిసి బెదిరింపులకు పాల్పడింని తెలుసుకున్నారు. కేసులో సంబంధమున్న తల్లీకూతుళ్లతో పాటు బెదిరంచిన ఇద్దరినీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa