ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాఠశాలలను పరిశీలించిన ఎంఈఓ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 06, 2022, 06:14 PM

పివిపాలెం మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలను ఎంఈవో వి. వేంకటేశ్వర రావు బుధవారం పరిశీలించారు. డేగలవారిపాలెం దివాన్ తోట గ్రామంలోని పాఠశాలలు తనిఖీ చేశారు. ఈ పాఠశాలల్లో విద్యార్ధుల విద్యా ప్రమాణాలు మండల సగటు కన్నా కొంచెం తక్కువుగా ఉన్నాయని ఎంఈవో పేర్కొన్నారు. ఉపాద్యాయుడు అష్రాఫ్ అలీ కృషి బాగుందని కితాబు ఇచ్చారు. ప్రమాణాల పెంపుదలకు సూచనలను చేశారు. డేగలవారిపాలెం పాఠశాలలో అందుబాటులో ఉన్న గ్రాంట్లను ఉపయోగించి రన్నింగ్ వాటర్, టాయ్‌లెట్లు డోర్స్ , కిటికీల మరమ్మతులు, పెయింటింగ్ వంటి కార్యక్రమాలను చేపట్టవల్సిందిగా సూచించారు. దివాన్ తోట పాఠశాలలో జగనన్న గోరుముద్ద ను పరిశీలించారు. ఉపాద్యాయులు శ్రీనివాస రావు, బ్రహ్మయ్య, సి‌ఆర్‌పి లు స్రవంతి, కమలా, ముసలయ్య పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa