ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లబ్ది దారులకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు అందజేసిన ఎమ్మెల్యే ఆర్కే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 06, 2022, 06:24 PM

మంగళగిరి తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ హనుమంతరావులు ఓటీఎస్ పథకం క్రింద ఎంపికైన 11 మంది లబ్దిదారులకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే ఓటీఎస్ ప్రాధాన్యత ను వివరించారు. తహసీల్దార్ జీవి రామ్ ప్రసాద్ మాట్లాడుతూ ఓటీఎస్ విధానం తో లబ్దిదారులు రూ. 10 చెల్లిస్తే సదరు ఆస్తి పై యాజమాన్య హక్కులు పొందుతారని అన్నారు. మంగళగిరి పట్టణ, రూరల్ గ్రామాల్లో ఇప్పటి వరకు మొత్తం 61 మందికి ఓటీఎస్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు అందజేసినట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa