ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రనే లక్ష్యంగా పని చేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 06, 2022, 06:26 PM

 బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ రేపల్లె టౌన్, రేపల్లె రూరల్, చుండూరు సర్కిల్, బాపట్ల సబ్ డివిజన్ ల డిఎస్పీ, సిఐలతో వారి పరిధిలోని పోలీస్ స్టేషన్ ల నందు పరిస్థితి ఏవిధంగా ఉన్నది సమీక్షించారు.


ఎంత మంది సిబ్బంది ఉన్నది, వారి విధి నిర్వహణ, పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎస్పీకి తెలియజేశారు.


ప్రతి పోలీస్ స్టేషన్ లో నమోదయ్యే కేసుల వివరాలను గూర్చి, బౌగోళిక ప్రదేశాల గురించి, సంబంధిత ప్రదేశా లలో జరిగే ముఖ్యమైన ఫెస్టివల్, జాతరల గురించి జిల్లాలో నమోదైన ముఖ్యమైన కేసుల వివరాలు గురించి, చెడు నడత కలిగిన వ్యక్తుల వివరాలు, జిల్లా సరిహద్దు ప్రాంతాల వివరాలు, జిల్లాలోని నేషనల్ హైవే తదితర వివరాల గురించి డిఎస్పీ సిఐలు, ఎస్పీ కి కూలంకషంగా తెలియజేసినారు.


ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో గాని, నేరాల ఛేదనలో గాని, బందోబస్తు ఏర్పాట్లు, ప్రముఖుల సందర్శనలు ఏవైనా సమిష్టిగా కలిసికట్టుగా పనిచేస్తూ జిల్లా పోలీస్ శాఖ ప్రతిష్టను పెంపొందించేలా విధులు నిర్వర్తించాలని తెలిపారు.


దొంగతనాల కేసుల ఛేదనకు ప్రత్యేక క్రైమ్ బృందాలు ఏర్పాటు చేసుకోని రికవరీ శాతాన్ని పెంచాలన్నారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం పై కూడా అవగాహన కల్పించాలని, నేరాలు దోపిడీల నివారణకు సమర్ధవంతమైన బీట్లు, పికట్స్, లర్కింగ్ పాయింట్స్ ఏర్పాటు చేసుకొని అధికారులు తరుచుగా బీట్ చెక్ చేస్తూ సిబ్బందికి సూచనలు ఇవ్వాలన్నారు.


పోలీస్‌ స్టేషన్ పరిధిలో అపరిష్కృతంగా ఉన్న కేసులు ఛేదింపునకు, నేర నియంత్రణకు దోహదం చేసే పలు సూచనలు, మెళకువలను అధికారులకు వివరించారు.


పోలీస్ స్టేషన్ పరిధిలోని ముఖ్యమైన ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, స్థానిక ప్రజలకు వాటి ప్రాముఖ్యతను వివరిస్తూ కెమెరాలను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు.


అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిరంతరం నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఇసుక అక్రమ రవాణా, లిక్కర్ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. ఎన్ ఫోర్స్ మెంట్ పెంచి అక్రమ కార్యకలాపాలను కట్టడి చేయాలన్నారు.


పాత నేరస్తులు, రౌడీ షిటర్ల పై నిఘా పెంచాలని, పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న బెడ్ కేరక్టర్, ట్రబుల్ మాంగర్ లకు కౌన్సిలింగ్ ఇవ్వాలని, శాంతిభద్రతలకు విఘాతం కల్గించే ఎంతటివారినైనా ఉపేక్షించవద్దని తెలిపారు.


ఈ సమావేశంలో బాపట్ల డిఎస్పీ ఏ. శ్రీనివాస రావు, రేపల్లె సిఐ వి. సూర్య నారాయణ, రేపల్లె రూరల్ సిఐ శివ శంకర్, చుండూరు సర్కిల్ బి. కళ్యాణ్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa