ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముంబాయిలో....ఒమిక్రాన్ ఎక్స్ఈ కేసు నమోదు

national |  Suryaa Desk  | Published : Wed, Apr 06, 2022, 11:54 PM

ప్రపంచాన్ని మరోసారి వణికిస్తున్న ఒమిక్రాన్ ఎక్స్ఈ వెరియంట్ భారతదేశంలోకి ప్రవేశించింది. ఒమిక్రాన్ ఎక్స్ఈగా పిలుస్తున్న ఈ వేరియంట్‌కు సంబంధించిన తొలి కేసు మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలో బుధ‌వారం నాడు వెలుగు చూసింది. బ్రిట‌న్‌లో జ‌న‌వ‌రి 19న ఈ వేరియంట్ తొలి కేసు న‌మోదు కాగా.. తాజాగా భార‌త్‌లోనూ బుధ‌వారం ఈ వేరియంట్‌కు చెందిన తొలి కేసు న‌మోదైంది.  క‌రోనా కొత్త వేరియంట్ కేసు న‌మోదైన నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం దేశంలో హై అలర్ట్ ప్ర‌క‌టించింది. కొత్త  వేరియంట్‌పై అధ్య‌య‌నం జ‌రుగుతోంద‌న్న కేంద్ర ప్ర‌భుత్వం ఈ వేరియంట్‌కు సంబంధించి పెద్ద‌గా ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని ప్ర‌క‌టించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa