ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రౌత్ పై ఈడీ చర్యను మోదీ దృష్టికి తీసుకెళ్లా: శరద్ పవర్

national |  Suryaa Desk  | Published : Thu, Apr 07, 2022, 12:08 AM

శివసేన ఎం పీ  రౌత్ పై ఈడీ చర్యను మోదీ దృష్టికి తీసుకెళ్లానని ఎన్సీపీ అధినేత శరద్ పవర్ అన్నారు. ప్రధాని మోదీతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఈరోజు భేటీ అయ్యారు. వీరి సమావేశం సుమారు 25 నిమిషాల పాటు కొనసాగింది. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పై ఈడీ తీసుకున్న చర్య చాలా అన్యాయమని అన్నారు. ఆయన కుటుంబానికి సంబంధించిన ఆస్తులను జప్తు చేసిన అంశాన్ని మోదీ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. ఒక కేంద్ర సంస్థ ఇలాంటి చర్య తీసుకుంటే... దానికి వాళ్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే సంజయ్ రౌత్ పై ఈడీ చర్య తీసుకుందని చెప్పారు. రౌత్ పై ఈడీ చర్యను మోదీ దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఆయన ఏమీ మాట్లాడలేదని పవార్ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa