ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రయ్య కుటుంబానికి చంద్రన్న 25 లక్షల అందవేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 07, 2022, 11:29 AM

గత జనవరిలో మాచర్ల నియోజకవర్గం, గుండ్లపాడు గ్రామంలో వైసీపీ రౌడీల దాడిలో హత్యకు గురైన తెలుగుదేశం పార్టీ బీసీ నేత తోట చంద్రయ్య అంతిమయాత్రలో పాల్గొని పాడె మోసిన పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, చంద్రయ్య కుటుంబానికి అండగా ఉంటామని మాటిచ్చిన సంగతి తెలిసిందే. ఇచ్చిన మాటను నిలుపుకుంటూ జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల మీదుగా  25 లక్షల రూపాయలను చంద్రయ్య కుటుంబానికి అందేలా చేసి... పార్టీ జెండాను తమ భుజాలపై మోసే కార్యకర్తలకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని నిరూపించారు చంద్రబాబు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు గారు, మాచర్ల నియోజకవర్గం ఇంచార్జి జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ,మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ,యరపతినేని శ్రీనివాస రావు, కొమ్మాలపాటి శ్రీధర్ గారు, చదలవాడ అరవింద్ బాబు తదితర నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa