ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్లమెంటు ఉభయ సభలు నిరవధిక వాయిదా

national |  Suryaa Desk  | Published : Thu, Apr 07, 2022, 12:27 PM

పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. షెడ్యూల్‌ కంటే ఒకరోజు ముందే బడ్జెట్‌ సమావేశాలు ముగిశాయి. ఈ నెల 8వ తేదీ వరకు సమావేశాలను నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం సమావేశాలను ముందుగానే ముంగించింది. రెండు విడుతలు జరిగిన బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31న ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సితారామన్‌ 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఫిబ్రవరి 11న మొదటి విడుత సమావేశాలు ముగిశాయి. మళ్లీ మార్చి 14న రెండో విడుత బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 8న సమావేశాలు ముగియాల్సి ఉన్నది. అయితే ఒక రోజు ముందుగా ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa