ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బస్సులో అగ్ని మంటలు...తప్పిన అతిపెద్ద ప్రమాదం

national |  Suryaa Desk  | Published : Thu, Apr 07, 2022, 02:08 PM

ఢిల్లీలో ఓ బస్సు లో అగ్నిమంటలు వ్యాపించింది. కానీ ప్రమదం తప్పింది. మహిపాల్‌పనూర్ ప్రాంతంలో ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. దాదాపుగా బస్సు దగ్ధమైందని చెప్పుకోవచ్చు. అయితే ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేరు. బస్సు ఖాళీగా ఉంది. దాంతో ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు. ఈ ప్రమాద ఘటనపై స్థానికులు అగ్నిమాపక శాఖ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో వారు ఆ ప్రాంతానికి చేరుకుని మంటలు అదుపుచేయడానికి ప్రయత్నించారు. ఎనిమిది ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చి మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. మంటలు అదుపులోకి రావడానికి గంటకుపైగా సమయం పట్టింది. అయితే బస్సు దగ్గరగా ఉన్న రెండు దుకాణాల్లో కూడా మంటలు చెలరేగాయి. సిబ్బంది ఆ మంటలను కూడా ఆర్పేశారు.


ఈ ప్రమాదం బుధవారం మధ్యాహ్నం 2.20 గంటల సమయంలో జరిగిందని, ఆనంద్ విహార్ ఐఎస్‌బీటీ నుంచి మెహ్రౌలీకి వెళ్లే రూట్ నెంబర్ 534లో నడుస్తోన్న బస్సులో మంటలు వ్యాపించాయని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. అయితే ఈ అగ్నిప్రమాదం ఎలా జరిగిందనేది తమకు తెలియడం లేదని అధికారులు అంటున్నారు. మంటలు చెలరేగడానికి కారణాలు తెలియలేదు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. దాంట్లో బస్సు తగలబడిపోతున్న దృశ్యాలను చూడొచ్చు. ఇదిలావుంటే ఢిల్లీలో గత నెలలో కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. కంఝవాలా ప్రాంతంలో క్లస్టర్ బస్సులో మంటలు చెలరేగాయి. సాంకేతిక లోపం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. అప్పుడు కూడా బస్సు డిపో నుంచి బయటకు వెళ్లడంతో అందులో ప్రయాణికులు లేరు. దాంతో పెద్ద ముప్పు తప్పింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa