తన ప్రాణం ఉన్నంత వరకు జగన్‌తోనే ఉంటానని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తెలిపారు. 'మంత్రి పదవులు ఇచ్చేటప్పుడే రెండున్నరేళ్లని జగన్ స్పష్టంగా చెప్పారు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడే ఉంటా. రాజీనామాలపై బాధ లేదు. కూలీ కుటుంబం నుంచి వచ్చిన నేను ఈ స్థాయికి వెళ్తానని అనుకోలేదు. నేను బతికున్నంత వరకు జగన్ సీఎంగా ఉండాలనేది నా ఆశ. నాకు ఇచ్చిన బాధ్యతను సమర్థంగా నిర్వహించా' అని ఆయన చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa