ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విలీన గ్రామాల్లో చేతి పంపులకు మరమ్మతులు చేయించాలని వినతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 07, 2022, 07:29 PM

ఏటేటా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో బోర్లు, బావులు, చెరువులు ఎండిపోతున్నాయి. వేసవికాలం పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. తాగేందుకు గుక్కెడు మంచి నీళ్ళు కూడా దొరకని పరిస్థితి. కనీసం చేతి పంపు నీటితో నైనా గొంతు తడుపు కుందామనుకుంటే అవి మొరాయిస్తున్నాయి. చేతిపంపుల మరమ్మతుల పేరుతో నిధులను సంబంధిత శాఖల అధికారులు ఎక్కడ ఖర్చుచేస్తున్నారో ఏమో తెలియదు కానీ స్వాహ చేస్తున్నారనే ఆరోపణలు అయితే మాత్రం ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి విలీన గ్రామాల్లో మొత్తం దాదాపు 500లకు పైనే చేతి పంపులున్నాయి. వాటిలో అధిక భాగం మరమ్మతులకు గురయ్యాయి. దీంతో చేతి పంపుల నీటిపైనే ఆధారపడే ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా తయారవుతోంది. మరమ్మతులకు గురైన చేతిపంపులను వెంటనే మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa