సీఎం జగన్ లక్ష్యాలకు అనుగుణంగా పని చేయటానికి శాయశక్తులా పని చేశానని మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. విద్యాశాఖ మంత్రిగా సీఎం తనకు గొప్ప అవకాశం ఇచ్చారని చెప్పారు. ముఖ్యమంత్రి కోసం తల కోసుకోవడానికి కూడా సిద్ధమేనన్నారు. విద్యారంగంలో సమూల మార్పులకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమేనని తెలిపారు.
పేదరికం విద్యకు అడ్డు కాకూడదనే విధానం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ది అన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్… గత పాలకులు విద్యను కార్పొటీకరణ చేయటానికి ప్రయత్నం చేశారన్న ఆయన.. విద్యారంగం సమూల మార్పులకు ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలు చేపట్టారని ప్రశంసలు కురిపించారు.. ఈ మూడేళ్లలో విద్యా రంగంపై 76 సమీక్షలు సీఎం చేపట్టినట్టు వెల్లడించారు.. ఇక, తనకు ఏ బాధ్యత ఇచ్చినా మరింత ఉత్సాహంగా పని చేస్తానని వెల్లడించారు మంత్రి ఆదిమూలపు సురేష్..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa