నగర ప్రజల సౌకర్యార్దo జియంసి ప్రధాన కార్యాలయంలో, సర్కిల్ కార్యాలయాలలో క్యాష్ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. గుంటూరు నగరపాలక సంస్థకు నగరప్రజలు, 2022, 2023 సంవత్సరంకు చెల్లించవలసిన ఆస్తిపన్ను, ఇంటి పన్ను, నీటిపన్నులను, ఏప్రిల్30వ తేదీలోపు చెల్లించి, 5శాతం రాయితీ పొందగలరని కమిషనర్ తెలిపారు. ప్రజల సౌకర్యార్దo గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం నందు, బృందావన్ గార్డెన్స్ లోని సర్కిల్ కార్యాలయంలో క్యాష్ కౌంటర్లు పెంచడమైనదని, ఎండ వేడిమి తగలకుండా టెంట్లు, దాహార్డీ తీర్చేoదుకు మంచినీటిని ఏర్పాటు చేసినట్లు, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చేకూరి కీర్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa