ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాపట్ల లో పట్టపగలు చోరీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 07, 2022, 07:42 PM

బాపట్ల ఇస్లాంపేట లో పట్టపగలు చోరీ జరిగింది. గురువారం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల లోపు చోరీ జరిగినట్లు తెలిపారు. 5 సవర్లు బంగారం, 70 వేలు డబ్బు సూరి గురైందని బాధితులు పేర్కొన్నారు. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ చోరీ జరిగినట్టు బాధితులు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో పట్టణ పోలీసులు చోరీ జరిగిన ప్రదేశానికి వచ్చి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa