పసుపు పంట వేసిన రైతులను ఆదుకునేందుకు, పసుపు క్వింటా 10 వేల రూపాయలకు కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తూర్పు గుంటూరు జిల్లా కార్యదర్శి జొన్న శివ శంకర రావు అన్నారు. గురువారం మంగళగిరి- తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రాతూరు గ్రామంలో రైతు నాయకులతో కలిసి పసుపు పంటను పరిశీలించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శివశంకరరావు మాట్లాడుతూ ప్రస్తుతం పసుపు ధర రూ. 6వేలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, దీని వలన రైతులకు ఏమాత్రం గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదన్నారు.
ఎకరానికి 18 నుండి 20 క్వింటాళ్ల దిగుబడి వస్తున్న పసుపు పంటకు, క్వింటా 6 వేల రూపాయల చొప్పున అమ్ముకోవడం వలన ఒక ఎకరానికి లక్ష ఇరవై వేలు మాత్రమే వస్తుందని అన్నారు. దీంతో కౌలు కలుపుకొని యాబైవేలు నష్టపోతున్నారని ఆయన అన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి పసుపు రైతులను ఆదుకునేందుకు క్వింటా పసుపు రూ. 10 వేల మద్దతు ధర ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే విధంగా గ్రామాలలోని రైతు భరోసా కేంద్రాల ద్వారా మార్క్ఫెడ్ ద్వారా పసుపును కొనుగోలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తాడేపల్లి మండల నాయకులు దొంతి రెడ్డి వెంకట్ రెడ్డి, సిపిఎం ప్రాతూరు గ్రామ శాఖ కార్యదర్శి డోకి పర్తి రాజేంద్ర బాబు, ప్రాతూరు గ్రామ రైతులు సూరిశెట్టి వెంకటేశ్వరరావు, బుర్ర రాజు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa