ఏలుకే కదా అని తేలికగా తీసుకొంటే కొంపలే తగలెడిపోతాయ్. గుజరాత్ లోని ఓ వ్యాపారి ఇంట్లో విచారకర సంఘటన జరిగింది. అహ్మదాబాద్ కు చెందిన వినోద్ భాయ్ ఓ వ్యాపారి. చైత్ర నవరాత్రుల సందర్భంగా ఆయన తన ఇంట్లో దీపం వెలిగించారు. అయితే, ఓ ఎలుక ఆ దీపాన్ని లాక్కెళ్లి ఇంట్లో ఉన్న దుస్తుల్లో పడేసింది. దాంతో దుస్తులు అంటుకుని మంటలు ఇల్లంతా వ్యాపించాయి. ఆ సమయంలో ఇంట్లో ఉన్న రూ.2 లక్షల నగదు కూడా కాలి బూడిదైంది. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa