కరోనా థర్డ్ వేవ్ ముగిసిందని అంతా సంబరపడుతున్నారు. ప్రపంచ దేశాల్ల ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్నా మన దేశంలో ఆ ప్రభావం లేదని అంతా సంతోషంగా ఉన్నాయి. ఈ తరుణంలో మన దేశంలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్ఈ తొలి కేసు బుధవారం నమోదైంది. అధికంగా వ్యాప్తి చెందే గుణం దీనికి ఉండడం కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఈ తరుణంలో ఆస్ట్రియా పరిశోధకులు ప్రపంచానికి గుడ్ న్యూస్ అందించారు. తాము తయారు చేసిన టీకా ఒమిక్రాన్‌తో సహా అన్ని కరోనా వేరియంట్లపై సమర్థవంతం పని చేస్తుందని చెబుతున్నారు. అలెర్జీ జర్నల్‌లో ప్రచురించిన వారి పరిశోధన వివరాలను ప్రపంచానికి కొత్త ఊపిరిని అందించాయి. వియన్నా మెడికల్ యూనివర్సిటీలో ఈ కొత్త టీకాను అభివృద్ధి చేశారు. యాంటిజెన్ ఆధారిత వ్యాక్సిన్‌గా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జంతువులతో పాటు మానవుల్లోనూ పరిశోధనలు చేశామని, కరోనా వైరస్‌ను కట్టడి చేసే యాంటీబాడీల ప్రతిస్పందన ఉందని పేర్కొన్నారు. శరీరంలోకి వైరస్ ప్రవేశించకుండా ఈ టీకా నిరోధిస్తుందని పరిశోధనకు నేతృత్వం వహించిన రుడాల్ఫ్ వాలెంటా వెల్లడించారు.