ఏపీ ప్రభుత్వం నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గా అనుపమ అంజలి (ప్రస్తుతం గుంటూరు జాయింట్ కలెక్టర్), రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ గా కె.దినేష్ కుమార్ లను ప్రభుత్వం నియమించింది. రంపచోడవరం ఐటీడీఏ పీవోగా పనిచేస్తున్న టి.నిషాంతిని అక్కడి నుంచి బదిలీ చేసింది. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ప్రకాశం జిల్లా సచివాలయాల విభాగం జాయింట్ కలెక్టర్ టీఎస్ చేతన్ ను సత్యసాయి జిల్లా జేసీగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.