జలం కోసం ఉత్తరాంధ్ర జనపోరు యాత్రలో భాగంగా హిరమండలం రిజర్వాయర్,నేరడి బ్యారేజి, వరదా బ్యారేజి లను బీజేపీ రాష్ట్ర నాయకులూ సోము వీర్రాజు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలకోసం మొదలుపెట్టిన పనిని మధ్యలో అపకూడదని నాన్న గారు నాకు చెప్పారని బహిరంగ సభలో ఉత్తరాంధ్ర ప్రజలకు వాగ్ధానం చేసిన ముఖ్యమంత్రి జగన్ గారు ఆ స్థాయిలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసిన పాపాన పోలేదు. ఫలితంగా రైతులు పట్టణాలకు వలస పోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.మానవతా దృక్పథంతో ఇప్పటికైనా ఉత్తరాంధ్ర ప్రాంతంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa