గుజరాత్‌లో ఓమిక్రాన్ సబ్-వేరియంట్ అయిన ఎక్స్‌ఈ కేసు వెలుగు చూసింది. రోగికి మార్చి 13న కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. వారం తర్వాత అతడు కోలుకున్నాడు. అతడి నుంచి నమూనాలను సేకరించి, జీనోమ్-సీక్వెన్సింగ్‌కు పంపించారు. తాజాగా ఆ ఫలితాలు వెలువడ్డాయి. దీంతో రోగికి ఎక్స్‌ఈ వేరియంట్ కరోనా సోకినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఓమిక్రాన్ బీఏ.2 సబ్-వేరియంట్ కంటే ఇది దాదాపు పది శాతం ఎక్కువగా వ్యాపిస్తుంది. ఇదిలా ఉండగా గత 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 1150 మందికి కరోనా వచ్చింది. 83 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. 1194 మంది కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం మొత్తం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 11,365గా ఉంది.