దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ ద్వారా రికార్డు స్థాయిలో టోల్ చెల్లింపులు వసూలయ్యాయి. మార్చిలో రూ. 4, 095 కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే వసూళ్లలో 33% వృద్ధి నమోదైంది. 2016లో ఫాస్టాగ్ అమల్లోకి వచ్చాక ఒక నెలలో ఈ స్థాయి వసూళ్లు రావడం ఇదే తొలిసారి. గత ఆర్థిక సంవత్సరం ఫాస్టాగ్ టోల్ వసూళ్లు రూ. 38, 084 కోట్లుగా నమోదయ్యాయి. ప్రయాణికుల వాహనాల్లో 97% ఫాస్టాగ్ విధానానికి మారాయని కేంద్రం తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa