శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం ముక్కడిపేటకు చెందిన అబ్దుల్ హసీబ్ ఎలక్ట్రికల్ వస్తువుల మరమ్మతులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇంట్లో రెండు పంకాలు, మూడు బల్బులు మించి లేవు. ఏసీ ఉన్నా వినియోగించరు. గతంలో నెలకు రూ. 300-350 మించి విద్యుత్తు బిల్లు వచ్చేదికాదు. అలాంటిది ఈ నెలకు సంబంధించి రూ. 6, 583 యూనిట్లను వినియోగించారని, రూ. 64, 211 చెల్లించాలని ఆదివారం బిల్లు రావడంతో ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.