ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో స్థానిక మెయిన్ బజార్ లో ఆర్యవైశ్య సంఘాలు అందరూ కలిసి నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గత 70 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల కీబినెట్ ల లో ఆర్యవైశ్య లకు మంత్రి పదవి లేకుండా ఎప్పుడు లేదు, కానీ ఈ ప్రభుత్వం లో ఆర్యవైశ్య ల కు మంత్రి పదవి ఇవ్వక పోవడం చాలా బాధాకరంగా ఉంది. అందుకు నిరసనగా కంభం లోని షాపుల అన్నీ అసోసియేషన్స్ సముదాయాలు మూత వేసి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు పెద్దలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.