సముద్రంలో మత్స్య సంపద పెరుగుదలకు సహకరించే ఆలీవ్‌రెడ్లీ తాబేళ్ళ సంతతి పిల్లలను ఆదివారం సురక్షితంగా సముద్రంలోకి వదిలారు. ట్రీ ఫౌండేషన్, అటవీ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సముద్ర తాబేళ్ళ సంరక్షణా కేంద్రం నుంచి వేటపాలెం మండలంలోని రామాపురం సముద్ర తీరంలో డాక్టర్ బూదాటి విజయసారధి చేతుల మీదుగా 90 ఆలీవ్‌రెడ్లీ తాబేళ్ళ పిల్లలను సముద్రంలోకి వదలడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవ వైవిధ్యం, ఆహారపు గొలుసు, పరిసరాల పరిశుభ్రత పర్యావరణంలో అతి ప్రధానమైనవని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రీ ఫౌండేషన్ జిల్లా కోఅర్డినేటర్ శవనం చంద్రారెడ్డి, తాబేళ్ళ సంరక్షకులు లక్ష్మయ్య, సుబ్బారావు, స్థానికులు పాల్గొన్నారు.