మంత్రవర్గ విస్తరణలో చిత్తూరు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు అగ్రతాంబూలం లభించింది. ముఖ్యమంత్రి జగన్ చిత్తూరు జిల్లాపై తన ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. కొత్తగా కొలువుదీరనున్న కేబినెట్లో అత్యధిక మంత్రులు ఈ జిల్లాకు చెందిన వారే. పాత మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామిలను కొనసాగించిన ముఖ్యమంత్రి... ఈ విడతలో నగరి ఎమ్మెల్యే రోజాకు కూడా అవకాశం ఇచ్చారు. దీంతో, ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే మంత్రుల సంఖ్య మూడుకు పెరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా వైసీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. స్వీట్లు పంచుతూ, బాణసంచా కాల్చుతూ కార్యకర్తలు హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా పని చేసిన నారాయణస్వామికి ఈసారి కూడా అదే పదవి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa