ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్యాంగ్ వార్...రాడ్లు..హాకీ స్టిక్ లతో విద్యార్థుల పరస్పర దాడులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 12, 2022, 12:26 AM

ఏపీలో ఎన్టీఆర్ జిల్లాలో కొత్త కల్చర్ ప్రారంభమైంది. ఏపీలోని కొత్త‌గా ఏర్పాటైన ఎన్టీఆర్ జిల్లాలో సోమ‌వారం గ్యాంగ్ వార్ చోటుచేసుకుంది. విజ‌య‌వాడ స‌మీపంలోని కంచిక‌చ‌ర్ల‌కు చెందిన మిక్ క‌ళాశాల‌కు చెందిన విద్యార్థుల మ‌ధ్య చెల‌రేగిన ఓ వివాదం చిలికి చిలికి గాలి వాన‌లా మారింది. ఇరువ‌ర్గాలుగా విడిపోయిన విద్యార్థులు హాకీ స్టిక్‌లు, ఐర‌న్ రాడ్లు చేత‌బ‌ట్టి ఒక‌రిపై మ‌రొక‌రు దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ప‌లువురు విద్యార్థుల‌కు గాయాలు కాగా.. వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.


క‌ళాశాలకు చెందిన విద్యార్థుల గ్రూపుల్లో ఇన్‌స్టాగ్రాంలో ప్ర‌త్య‌క్ష‌మైన పోస్టుల‌తో వివాదం రేకెత్తింది. ఈ వివాదం వాగ్వాదాల‌కు మాత్ర‌మే ప‌రిమితం కాకుండా ఏకంగా గ్యాంగ్ వార్‌కు దారి తీసింది. ఇరు వ‌ర్గాలుగా విడిపోయిన విద్యార్థులు చేతికి అందిన హాకీ స్టిక్‌లు, రాడ్ల‌తో ప‌ర‌స్ప‌రం దాడులు చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు వివ‌రాల‌పై ఆరా తీస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa