చమురు, వంటగ్యాస్ తో పాటు నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్వర చర్యలు చేపట్టాలని తంబళ్లపల్లె సీపీఐ ప్రాంతీయ కార్యదర్శి మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకిస్తూ రేపు గ్రామ వార్డు సచివాలయం ఎదుట నిర్వహించతలపెట్టిన ధర్నాకు తరలి రావాలని ప్రజలను కోరుతూ గోడ పత్రికలు బీ. కొత్తకోట బస్టాండ్ లో పార్టీ నాయకులు ఆవిష్కరించారు.