రాష్ట్రమంత్రి గా సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డిని జిల్లా అధికార ప్రతినిధి కట్టా సుధాకర్ రెడ్డి సన్మానించారు. అమరావతి లోని సచివాలయ ప్రాంగణంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం కాకాణి గోవర్ధన్ రెడ్డిని కట్టా సుధాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలసి అభినందించారు. అనంతరం కాకాణి గోవర్ధన్ రెడ్డికి శాలువాలు కప్పి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు.
కేబినెట్ లో కాకాణికి అవకాశం కల్పించిన సిఎం జగన్మోహన్ రెడ్డికి కట్టా సుధాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన వెంట నాయుడుపేట మాజీ వైస్ ఎంపిపి ఎన్. కస్తూరయ్య, ఓజిలి వైసిపి నాయకులు ముమ్మడి సుబ్బారావు, ఎస్. రామ్మోహన్, ఓజిలి మాజీ సర్పంచ్ వేణు, పలువురు వైసీపీ నాయకులు ఉన్నారు.