పిల్లలకు మంచి మంచి పాఠాలు చెప్పి సద్బుద్ధి నేర్పాల్సిన ఉపాధ్యాయుడే దారితప్పాడు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ప్రకారం విజయనగరం జిల్లా సీతంపేట మండలంలోని కుశిమిలో ఎస్‌ఈబీ సిబ్బంది సోమవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా తాలాడ ప్రభుత్వ పాఠశాలలో హెచ్‌ఎంగా విధులు నిర్వహిస్తున్న పాలక నాగేశ్వరరావును రూ.1,642 విలువగల గుట్కాలతో అరెస్టు చేసి సీతంపేట స్టేషన్‌కు అప్పగించారు. దాడుల్లో సబ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ విజయకుమార్, సిబ్బంది ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa