ఓ మహిళకు వివాహమైంది. అయితే, ఆమె ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త అతడిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేశాడు.నగ్నంగా వీడియో కూడా తీశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతడితోపాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన హర్యానాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
హర్యానా రాష్ట్రంలోని ఫతేబాద్ కు చెందిన పంకజ్ అనే వ్యక్తికి వివాహమైంది. అయితే, అతని భార్య ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త పంకజ్ అతడిని మరో నలుగురు స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత అతడిని ఓ రూంలో 3 రోజులపాటు బంధించి చిత్రహింసలకు గురి చేశాడు.అంతేకాకుండా అతడిని నగ్నంగా మార్చి వీడియోలు కూడా తీశాడు. అయితే, తన కొడుకు కనిపించడంలేదంటూ ఆ యువకుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ విషయం పంకజ్ కు తెలియడంతో ఆ యువకుడిని వదిలేశాడు. అక్కడి నుంచి ఆ యువకుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన విషయమంతా చెప్పుకొచ్చాడు. దీంతో పంకజ్ తోపాటు అతని స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa