1919 ఏఫ్రెల్ 13 భారతదేశచరిత్రలోనే అత్యంత చీకటిరోజు. మానవరూపంలో వుండే ఒక మృగం , జ్యాత్యహంకార గర్వంతో, తన ఆథిపత్యమును నిరూపించుకొనుటకు కొన్ని వందలమందిని , చిన్నపిల్లలు, పెద్దలు , స్త్రీలు అనే భేదం లేకుండా పిట్టలను కాల్చినట్లు కాల్చిచంపిన రోజు "అదే జలియన్ వాలా బాగ్ దురంతం"జరిగినరోజు. మొదటి ప్రపంచ యుద్దం తరువాత ప్రపంచంలో కొన్ని మార్పులు చోటుచేసుకొన్నాయి. అందులో ముఖ్యంగా రష్యాలో బోల్షివిక్ విప్లవం ముఖ్యమైనది.
దీని ప్రభావము భారతీయుల మీద పడుతుందనే అనుమానం తో ఆంగ్లేయులు "రౌలత్ చట్టం"తీసుకోచ్చారు. ఈ చట్టం ప్రకారం ఎవరినైనా దేశద్రోహం క్రింద ఎటువంటి విచారణ లేకుండా అరెష్ట్ చేసిజైల్ లో పెట్టవచ్చు. అందులో భాగంగా సత్యపాల్ , సైఫుల్లద్దీన్ క్లిచిలీ లను అరెష్టు చేశారు. దీనికి నిరసనగా పంజాబ్ అమృతసర్ లోని జలియన్ వాలాబాగ్ అనే తోటలో (పార్క్ ) లో సమావేశము ఏర్పాటుచేసి వక్తలందరూ శాంతియుతంగా మాట్లాడుతూ వుండగా , ప్రజలు శ్రద్దగా వింటున్నారు. ఇంతలో అక్కడికి మైకేల్ O డయ్యర్ అనే పోలీస్ జనరల్ తన పరివారంతో వచ్చి నాలుగువైపుదారులను మూసివేసి ఎటువంటి హెచ్చరికలు లేకుండా విచక్షణా రహితంగా కాల్పులు జరిపించాడు.
ప్రజలు హాహాకారాలు చేస్తూ బయటకు పరుగులు తీయలని చూడగా దారులన్ని మూసివేసివున్నవి. నిస్సహాయులైన ప్రజలు తూటాలకు బలైపోసాగారు. 1600 రౌండ్స తరువాత కాల్పులు విరమించగా అప్పటికే కొన్ని వందలమంది విగతజీవులయ్యారు. రెండు వేలమందికి పైకా క్షతగాత్రులైనారు. ఎంతదారుణం అంటే ఒక్క బావిలోనే వందపైగా శవాలు బయటపడ్డాయి, 6 నెలల పసికందు కూడా తూటాలకు బలైపోయింది. ప్రపంచమంతా ఈ సంఘటన పట్ల దిగ్బ్రాంతి చెందింది. ఇది అత్యంత హేయమైన , క్రూరమైన పైశాచికచర్యగా విదేశమీడియాసైతం విమర్సించింది. కాని బ్రిటీష్ వారు మాత్రం "డయ్యర్ "నీ పంజాబ్ రక్షకుడిగా ప్రకటించి హజ్ అఫ్ లార్డ్స్ లో ఘనంగా సన్మానించింది.
ఇంగ్లండ్ లో అతను ప్రముఖుడైపోయాడు. బ్రిటిష్ మీడియా అంతా హీరో గా ఆకాశానికి ఎత్తేశాయి. కాని జలియన్ వాలాబాగ్ సభక మంచినీరును అందించడానికి వాలంటీర్ గా ఒక అనాధశరణాలయం నుంచి వచ్చాడో అబ్బాయి తనుకూడా తుపాకీ మడిమలతో దెబ్బలు తిన్నాడు, జరిగిన ఘోరాన్ని కళ్ళారచూస్తున్నాడు. వికృతంగా నవ్వుతున్న "డయ్యర్ ను"చూస్తున్నాడు. ఎలాగోలా గాయాలతో బయటపడి అమృతసర్ కోనేరులో రక్తం మరకలను కడుగుకొని"ఈ దురంతానికి కారమైన డయ్యర్స్ ను చంపతానని ప్రతిజ్ఞ చేశాడు.
21సంవత్సరాలు ఆయనను వెంటాడి వేటాడి చంపాడు ఉద్ధం సింగ్. ఎంతో ఉదారస్వామ్యులు, మానవతామూర్తులు, ప్రజాస్వామ్యవాదులు అయిన అంగ్లేయులు ఈ ఘోర మారణకాండ పట్ల ఇప్పటికీ సంతాపం గానీ క్షమాపణలు గానీ వ్యక్తం చేయలేదు. అయితే ఆనాటి యావత్ దేశాన్ని ఒక కుదుపుకుదిపింది. యువత స్వతంత్రపోరాటం వైపు మల్లేందుకు దోహదపడింది. ఆనాటి ఘోరసంఘటన లో ప్రాణాలు కోల్పోయిన అభాగ్యలందరికీ నివాళులు అర్పిస్తున్నాను.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa