ప్రముఖ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. తన శిక్షను మరోసారి పరిశీలించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామ, వార్డు సచివాలయాల తొలగింపునకు గతంలో హైకోర్టు ఆదేశించింది. ఆ ఉత్తర్వులు పట్టించుకోకపోవడంతో శ్రీలక్ష్మి సహా 8 మంది ఐఏఎస్ అధికారులకు ఉన్నత న్యాయస్థానం శిక్ష విధించింది. హాస్టళ్లలో సామాజిక సేవ చేయాలని హైకోర్టు శ్రీలక్ష్మిని ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa