కేంద్రీయ విద్యాలయాల్లో ప్రత్యేక సీట్ల కోటాపై కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేబీఎస్) కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటాను రద్దు చేసింది. ఎంపీ కోటా రద్దు చేస్తూ కేంద్రీయ విద్యాలయ ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఇప్పటివరకు ఒక్కో ఎంపీకి ఏటా 10 సీట్లను కేబీఎస్ కేటాయిస్తూ వచ్చింది. అయితే ఈ కోటా పెంచాలని గత కొంతకాలంగా ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక కోటాను కేబీఎస్ పూర్తిగా రద్దు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa