జగనన్న అమ్మఒడి లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటితే అమ్మఒడి పథకం ప్రయోజనం అందదని పేర్కొంది. 300 యూనిట్ల లోపు విద్యుత్ వాడకం ఉన్న వారికే ఈ పథకం వర్తిస్తోందని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 8 నుంచి ఏప్రిల్ 30 వరకు విద్యార్థి హాజరు 75 శాతం లేకపోయినా ఈ పథకం కింద ప్రయోజనం పొందలేరని స్పష్టం చేసింది. బియ్యం కార్డు కొత్తది ఉండాలని, కొత్త జిల్లాల నేపథ్యంలో ఆధార్ లో జిల్లాల పేరు మార్చుకోవాలని తెలిపింది. బ్యాంక్ ఖాతాల్ని ఆధార్ తో లింక్ చేసుకోవాలని, సహా ఖాతాలు పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేసుకోవాలని సూచించింది.